ఒకే ఒక్క సంకీర్తన చాలు. అంతా “ పరతత్వాన్ని “ పరిచేస్తోంది. విప్పిచెప్తోంది. ఇంక ఏమీ లేదు , “ఇంతే” , అంటోంది. ఈ సంకీర్తన ఒక్కటి , ఆ ఒకే ఒక్కడైన పరమాత్మ యగు హరి ని గూర్చి వివరించి చెప్పింది.
“ ఆతని మూలమే జగమంతా , ఆతుమ లో “ హరి కీలు” యై వుండుగాని “
అని , సంకీర్తనం 362, సంపుటం 2 లో , అన్నమయ్య చెప్పారు.
ఆత్మ లోపల ముఖ్యమైన మాత్రిక విష్ణువు,” విష్ణువే “ నని భావము.
“ఆత్మ “ అంటే ఏంటి ?? ఆత్మ గుణగణాలేంటి?? అనే విషయం, అన్నమయ్య , 2వ సంపుటంలో ని, 419వ సంకీర్తనంలో పండు ఒలిచినట్లు, చెప్పేసారు. ఆత్మ అంటే, ఏ నిర్వచనము , భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడినదో, అదే అన్నమయ్య తెలుగు పాటలో వివరించారు.
“నైనం ఛిన్దన్తి శస్త్రాణి , నైనం దహతి పావకః , నచైనం క్లేదయత్యాపో ,నశోషయతి మారుతః “
ఏది అయితే , ఆయుధాలతో నరకబడదు, అగ్ని లో కాల్చబడదు , నీటిలో తడవదు , గాలిలో కొట్టుకబోదు , అదియే ” ఆత్మ “. ఈ గుణసము లున్నది, ఏ పదార్ధమూ గాలేదు. .
అది ఒక్క “క్షేత్రం “ మాత్రమే కాగలదు. ఈ క్షేత్రము ఊహాతీతమైన శక్తి ధారణ క్షేత్రం.
ఎంత లెక్కించలేని ప్రమాణాలలో ఆకర్షణశక్తి ఉన్నదంటే, “మనస్సు”కున్న గుణాలన్నీ అందులో ఇమిడి అమరినదై , “చిత్త ఆకర్షణ శక్తి క్షేత్రము ” గా మారిపోయినది.
“ చిత్తము, దానితోబాటు చైతన్యము గలిగిన అపార శక్తిద్ధారణ క్షేత్రమే ఆత్మ “..
అదృశ్యంగా, విశ్వ అంతరాళా లలో వ్యాపించియున్న “చిత్త యుత శక్తిద్ధారణ ఆకర్షణ క్షేత్రం” ఆత్మ. “ ఆత్మలోని ఆ మనస్సే హరి, అదే విష్ణువు. “.
విశ్వాత్మ , అనగా విశ్వమంతా వ్యాపించియున్న” విష్ణువే “. ఈ గొప్ప రహస్యమును గూర్చి , యీ క్రింది సంకీర్తనలో అన్నమయ్య విసదీకరించారు .
ఈతడు నరకువడడు, ఈతడగ్ని కాలడు
ఈతడు నీట ముణగడు , ఈతడు గాలిబోడు
చేతనుడై సర్వగతుండౌ , చలియించడేమి టను
ఈతల ననాది , ఈతండిరవు కదలడు
చేరి కానరానివాడు , చింతించరానివాడు
భారపు వికారాలను బాసినవాడీ “ఆత్మ ”
అరయ వెంకటేశునాదీనామీతండని
సారము తెలియుటే సత్యం జ్ఞానము
“ఆత్మా , హరి ఒక్కటే”. ఆత్మలో హరి, హరిలో ఆత్మ, “ అన్న “ పరతత్వ రహస్యము “, అంతరిక్ష విజ్ఞానశాస్త్ర రహస్యం కాక మరేమిటి?
అన్ని లోకాలు, సర్వమూ, “ ఆత్మలోనే ఇమిడి ఉన్నవి.
ఆత్మ కనిపించదు, ఊహకందనిరూపం, పదార్ధరహితమైన భారరహి తమైనది , శుద్ధ జ్ఞానం, కొన్ని కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాలనుండి వ్యవస్థితమైనది. ఆత్మలోని హరి లక్షణములుగూడా ఇవే .
అందుకే ఆత్మ , భూ మ్యాకర్షణ క్షేత్రంలోని , పంచభూతాత్మక తత్వమగు ప్రకృతితోగూడి, ఏ రూపమైనా ధరించవచ్చుఁ. విష్ణువును మనము ఏ రూపంలోనైనా, తలచి పూజింపవచ్చు.
ఆత్మ క్షేత్రము. హరి క్షేత్రజ్ఞుడు.
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి