అన్నమయ్య చాలా సంకీర్తనలలో, లోకాలు ఎన్ని?, అవి అంతరిక్షంలో ఎలాగ అమరియున్నవి ? వాటికి ఏదైనా పేర్లు ఉన్నాయా? అనే విషయాలను గూర్చి చక్కగా, తక్కువ పదములతో తెలియజేశాడు. ఇన్ని లోకాలు ఎక్కడినుండి తయారైనాయి? అదికూడా చెప్పేసాడు. అన్నమయ్య ఒక మహా జ్ఞానే కాదు, మహా విజ్ఞాని కూడా. సంపుటం 2, లోని 371సంకీర్తనలో ఇలా చెప్పాడు.
“శాశ్వత బ్రహ్మాన్డాలు బొడ్డునున్న దైవము “
అన్ని శాశ్వత బ్రహ్మాన్డాలు, అన్నీ పరబ్రహ్మ స్థానం లోనే వున్నాయి. పరబ్రహ్మ్మ విశ్వాన్తరాళాలలో “
“కేంద్రబిందువు.”పరబ్రహ్మ నుండే అన్ని బ్రహ్మాంఢములు ఉద్భవిస్తాయి. అంటే, శాశ్వతలోకాలు, అశాశ్వతాలోకాలు అని వేరు వేరుగా వున్నాయన్నమాట.
అశాశ్వత లోకాలు నియమితమైన కాలం వుండినాక క్షీణిస్తాయి, దగ్గరిలోనున్న బ్రహ్మలో నిబిడిపోతాయి.
శాశ్వతలోకాలు మాత్రం ఎప్పుడూ పరబ్రహ్మ స్థాన సమీపంలోనే నిలిచి ఉంటాయి.
“ నలుగడనటు పదునాల్గు లోకములు “ అని , 216 సంకీర్తన, 4వ సంపుటం లో చెప్పాడు.
లోకాలు 14. ఇవి శాశ్వతాలూకాలు. అన్నిటికి ప్రత్యేకమైన పేర్లు వున్నాయి.
భూలోకం, పాతాళలోకం, సుర లోకం, అసుర లోకం, బ్రహ్మ లోకం, విష్ణు లోకం ......... అని ఒక 14 శాశ్వతఆ
లోకాలున్నాయి. ఈ లోకాలన్నీ ఒకే తలములో లేవు., అన్న విషయము 3వ సంపుటంలో 294వ సంకీర్తనలో
ఇలా చెప్పేసాడు.
“ఏమని చెప్పెనోగాక యిలగల శాస్త్రాలు , కామించి వాదించేవారి కడ మే”.
“ అంచెల జగములకు హరియే ఆధారము, ఎంచగ ఆధారము ఇతనికేదో ?”
అంచెలు అంచెలుగా అమరిఉన్నవి అన్ని లోకాలు. ఒకే తలములో లేవు. అన్ని లోకములకు ఆధారం.
హరీయే. హరి అంటే విష్ణువు, విష్ణువునకు ఏ ఆధారము అవసరంలేదు. సంకీర్తన312, సంపుటం 3లో
“ ఇదిగా దదిగా దీన్నియూ నింతే, పది పది హరి నీ పదమే నిజము “
పదునాల్గవది బ్రహ్మ లోకము , కదిసి నీరు మునకల పొలము
పది పది =. 10 సార్లు 10 = 100వ పదములో విష్ణు లోకము వున్నది.
14వ పదంలో బ్రహ్మలోకం వున్నది. మిగిలిన లోకములన్నీ బ్రహ్మలోకము కంటే క్రింది అంచెలలో
వున్నాయి. బ్రహ్మ లోకం “ నీరు మునకల పొలము “ లాగా తడిగా ఉంటుంది అట.
మరి 100వ పదములో నున్న విష్ణు లోకము ” అచ్యుతపదము. “ ఎప్పటికీ తరగని కోట్ల సూర్య తేజము.
అదియే అన్ని లోకములకు ఆధారము.
ఈ పదునాలుగు లోకముల మధ్య రహదారులున్నవి. అవి, రాక పోకలకోసమై ఏర్పడి ఉన్నవి అనే గొప్ప
సంగతిని , అన్నమయ్య ఒక ఈ సంకీర్త నాలో చెప్పారు.
“వైకంఠంబునకు ఇవ్వలి లోకంబులురాకపోకల రచనలివి”
వై కంఠంబునకు, మిగిలిన లోకంబులకును మధ్య సందులు వున్నాయి. ఈ సందులు ఒకలోకంకి
ఇంకొకలోకంకి మధ్య రాకపోకల కోసం యే ర్పడిఉన్నవి. అంటే , అన్ని లోకాలు సంచార మార్గాలతో సంబధాలు కలిగి వున్నాయి. వేరే వేరే తలంలో నున్న లోకాల నడుమ సంబంధాలు ఉండటమేగాడు, అన్ని లోకాలను విష్ణు లోకమే సంరక్షిస్తుంది. అని అన్నమయ్య చెప్పారు.
" నలుగడ పదునాల్గు లోకములు వెలయ చొఛ్చితిని వెడలితిని".
అంటే 14 లోకములకు నాలుగు దిక్కులలో గల దారులలో తాను తిరిగి ఆ వెలుగు చూచి వెలికివచాచాడు
న. లోకముల మధ్య నేకాదు, లోకముల కు నాలుగు వై పులకూడా దారులులున్నాయి. ఈవిధముగా లోకాలన్నీ చక్కగ, రహదారులతో, రాకపోకలతో, విష్ణు తేజస్సుతో నిలిచి వున్నాయి.
అన్నమయ్య మాట.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి