అన్నమయ్య “ రుద్రుల “ గూర్చి ఈ క్రింది సంకీర్తనలో చెప్పారు.. రుద్రులు “ అగ్ని నిలయాలు.
“ ( ఫైర్ హౌసెస్ ). కనుక , రుద్రుని ఒక సజీవ స్థానంగా పరిగణించవచ్చుఁ. రుద్ర రూపం “ అగ్ని “
అన్ని రుద్రులు పరబ్రహ్మ సృష్టియే. “పరబ్రహ్మ “ లోక కేంద్ర స్థానం , మహా శక్తి స్తానం.
“ కైలాసమున కలడొక రుద్రుడు , తాలిమి ఏకాదశ రుద్రులు
కాలరుద్రుడు కడపట నదివో, రుద్రుల సంతాయనే జగము. “ (333 సంకీర్తన, 3వ సంపుటం ).
“ కైలాసము “ ఒక లోకం. దాని అధిపతి శివుడు. అదీగాక 11 రుద్రులు, లోకకేంద్రస్థానపరిమితిలో ఉంటాయి, లేక వుంటారు. ప్రతి ఒక్క రుద్రుడికి ఒక ప్రత్యేకమైన పేరు వున్నది.
కపిల, పింగళ, భీమా, విరూపాక్ష, విలోహిత, అజేష, శాస్ట, శాసన ...... మొదలుగా , పేర్లు గల రుద్రులున్నారు.
చివరి రుద్రుడు “ కాల. “ కాలుడు “. మొత్తానికి, లోకమంతా “రుద్రుల సంత “ అన్నారు అన్నమయ్య.
మరి, రుద్రుల పని ఏమిటి.?
లోకములు కానీ, మరేదైనా అంతరిక్ష అస్థిత్వాలు గానీ, బలహీనమై, స్థిరత్వం కోల్పోయినప్పుడు , అగ్నిలో నశింపచేయుటే. ఈ “ అగ్ని నిలయములు “ దేనినైనా భస్మం చేయగల శక్తీ చైతన్యాలు.
బ్రహ్మలు “సృష్టి” కారకాలైతే, రుద్రులు “వినాశకారకాలు. “
బ్రహ్మలైనా, రుద్రులైనా పుట్టించబడేది, ఒకే ఒక పరబ్రహ్మ నుండే. అందుకే, అన్నమయ్య , ఈ సంకీర్తన పల్లవిలో ఇలా అన్నారు. .........
“ ఒక్కడెవ్వడో ఉర్వికి దైవము, ఎక్కువనాతని ఎరుగవో మనసా “
అన్నమయ్యమాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి