17, జులై 2020, శుక్రవారం

కొరోనా నిర్బంధమ్, అలనాటి నిశ్శబ్దం

     శ్రీ   శ్రీ  అన్నమాచార్యులవారు,ఎన్నో  గొప్ప అంతరిక్ష రహస్యాలు , తన సంకీర్తనలద్వారా మనకు తెలియచేసిన మహా విజ్ఞాని, మహా జ్ఞాని. ఈ నాటి “ లొక్డౌన్" కరోనా పరిస్థితి యే , ఆ 15 వ శతాబ్దిలో కూడా వచ్చ్చిందని ,  ఒక సంకీర్తనలో వెల్లడించారు.          

ఒకానొక  సందర్భాన, ఒకానొక పరిపరిస్థితి ఎలాగొచ్చిందంటే , ఎవ్వరు వెలియ  తిరుగకూడదు, ఇంటిలోనే ఉండవలసినది.  అట్టి పరిస్థిలో ఎవ్వరూ ఇంకొకరిని కలవరాదు. తిరుపతి పూర్తిగా  నిశ్శబ్దమై , నిశ్శబ్దంలో  నిలిచిన  సంధర్భమది . ఒక్కరూ ఇంటిలోనుండి  బయట తిరగడమే , సాహసించడం లాంటి స్థితి. ఒకవేళ  ఇంటినుండి బయటికి వచ్చ్చినాకూడా , ఒక్కరే , ఎలాంటి జోడు లేకుండా , దూరముగా తిరుగవలసిన నిర్బంధపూరిత వాతావరణ పరిస్థితి ఏర్పడినది.   


     “     ఓహోహో యనరో  పారి , సాహసాన తిరుగరో   జంట  పారి ”.        
     
 
   ఆకాశాన సూర్యచంద్రులు  ఎదురెదురెయిన  కాలము, అంటే “గ్రహణం “ సంభవించిన స్థితి , అది ఎటువం “ 
గ్రహణమంటే, ఎవ్వరూ దర్శించకూడనిది. ఆ  వాతావరణములో  వెలుపల తిరగడమంటే , పెద్ద “ సాహసముగా” భావించబడ్డ  విషమకాలము, విషకాలము.  విష పూరిత  వాతావరణము . 

        “ తిరుపణి  మణగెను , తిరుగరాదెవ్వరికీ, మరల నెలుగియ్యరో  మగపారి  

                                                                   “””””.                ఇరవాయ  సూర్యచంద్రులెదురు   పారి    “

            “పేనిపట్టి  వాకిళ్ళ  బీగముద్రలాయనిడి, కానిమ్మని  వాయించరో  గంట పారి”

 ఎంత  నిశ్శబ్దనిర్బంధమంటే , దేవాలయం  తలుపులు కూడా తాళ్లతోకట్టి బీగాలువేసి సీలు వేసారట.  దేవాలయము  బయటనుండి భక్తులు వారి, వారి  కోరికలు విన్న వించుకోవలసినదే . ఒక నిశ్శబ్ద నిర్బంధ పరిస్థితి,  శ్రీఅన్నమాచార్యులవారి  కాలంలోకూడా  వచ్చింది, అని పై సంకీర్తన చెప్తోంది ..     కాలం వేరే , కానీ,  కష్టమదే . పరిష్కారాలు : నిశ్శబ్దం, నిర్బంధం.       


“ హిస్టరీ రిపీట్స్ “, అంటే  చరిత్రలో జరిగినవి మళ్ళీ  మళ్ళీ జరుగుతూంటాయి , అని భావం. 
అన్నమయ్యనాటి  నిశ్శబ్దంలాటిదే , నేటి   కరోనా వైరస్ నిర్బంధం ......    

     


అన్నమయ్య మాట 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి