29, ఆగస్టు 2018, బుధవారం

దేవతలు

  లోకాలన్నీ  సృష్టించి, పాలించి , క్షయింపజేసే  బ్రహ్మ విష్ణు రుద్రాదులేగాక , వారికి సహాయముగా  దేవతలు కూడా  పరబ్రహ్మ (చే ) నుండి సృష్టించబడియున్నారు.
దేవతలు కొంత ప్రమాణంలో “పవర్స్ “   ఉన్న అస్తిత్వాలు. దేవతలను “ దివిజులు “ అనికూడా పిలుచుట పరిపాటే. దివి అంటే  అంతరిక్షము.  అంతరిక్షములోనున్నారు  కనుక  దివిజులు  అనిపిలవడమైంది.

దేవతల పని ,  బ్రహ్మ విష్ణు రుద్రుల పనిలో సహకరించడమే.  “వర్కింగ్ ఫోర్స్ అఫ్ ఆక్షన్ “.. “పవర్ బాడీస్ “
పని ముగిసిన పిమ్మట  మరలా ఎక్కడినుండి వచ్చ్చారో , ఆచోటిలోకే చేరుతారు, కలిసిపోతారు.  ఈ విషయం క్రింది సంకీర్తనలో అన్నమయ్య ఎంత చక్కగా చెప్పారో .........

                       “ పుట్టిరి దివిజులు  పురుషోత్తమునందు, అట్టే  అణగిరి యతనందు
                         ఇట్టే యీతని ఇందరితో సరివెట్టి  కొలుచుట పెనువెఱ్ఱి “   (55.8, 3వ సంపుటం )

ఇక్కడ పురుషోత్తముడు , పరబ్రహ్మ యే  గదా.    ఏయే విధముగా  బ్రహ్మలు, రుద్రులు , రోమకూపములు
పరబ్రహ్మ నుండి పుట్టినవో,  అదే మాదిరిగా దేవతలూ , పరబ్రహ్మ నుండి పుట్టుతారు, తిరిగి  పరబ్రహ్మలోనికే  కలుస్తారు. పరబ్రహ్మను మిగిలినవారితో  పోల్చి మాట్లాడకూడదు. అది పిచ్చ్చిపని , అంటారు అన్నమయ్య.  కొన్ని  వేవేల  సంఖ్యలో  వుంటారు  దేవతలు.
వేరే వేరే  దేవతలకు వేరే వేరే  శక్తులు, పదవులు  ఉంటాయి. రక రకాల వైభవాలను కల్పించే బలము గలవారు   దేవతలే.  దేవతలందరిలో  మహా శక్తి వంతమైన  దేవత  లక్ష్మీదేవి,  అద్భుతమైన వైభవాన్ని కలిగి, ఎప్పుడూ  విష్ణువుతోనే, విష్ణువులోనే ఉంటుంది. విష్ణు శక్తిఐ ఉంటుంది.  రకరకాల సంపదలు , ఎలాగంటే ఉదాహరణకు ........   ,   కీర్తి, ధనము , ప్రతిష్ట , ఆరోగ్యము, దార్ఢ్యము,  ధైర్యము, సంతానము,  మొదలుగా , అనేక సంపదలు లక్ష్మి దేవియే కలిగిస్తుంది.
ఈవిషయాన్ని   అన్నమయ్య  ఈక్రింది చరణంలో ఇలాగ చెప్తారు.

             జీవాంతరాత్ముడు శ్రీ వేంకటేశుడు , ఈవాళ శ్రీ లక్ష్మి యీతని దేవులు
           వేవేల సిరులు  వీరే  యొసఁగిరని  భావించువారికి పట్టదు వెర్రి.

పైనచెప్పిన  విధంగా సకల జీవులలోనున్న  ఆ పరమాత్మ, వైకుంఠేసుడగు  విష్ణువు  లక్ష్మితో చేరి,  వేవేల దేవతల  బలగంతో కూడి , సంపదలను ఇస్తూ వుంటారు అని తెలిసికోవాలి.
 పవర్స్ ఉన్న వారు  దేవతలు.  వారివారి,    నియోగించబడ్డ  అధికారములతో ,  నియోగించబడ్డ  పవర్స్ తో,
ప్రధాన దేవతలౌ  బ్రహ్మ, విష్ణు , రుద్రులకు సహకరించుచు వుంటారు..
వారే దేవతలు.  వారే  కాస్మిక్ పవర్స్ .
   
                         అన్నమయ్య మాట 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి