11, జూన్ 2018, సోమవారం

పరబ్రహ్మ

 అన్నమయ్య  ఒక  మహా  కవిగాయకుడు. ఈతను 15 వ  శతాబ్దిలోనున్న శ్రీ వెంకటేశ్వర స్వామీ భక్తుడు...
“ పదకవితాపితామహుడు “ అన్న  బిరుదుతో  ప్రసిద్ధికెక్కిన  మహా సంగీతజ్ఞుడు. అసాధారణ ప్రజ్ఞాశాలి.
కొన్నివేల సంకీర్తనలు వ్రాసిన కవిసార్వభౌముడు. ఆయన వ్రాసిన సంకీర్తనలలో కొన్ని సంకీర్తనలు అన్తరిక్షజ్ఞాన పుంజాలు. అనేక విశ్వాఅంతరిక్ష విషయాలు, ఎంతో నర్మగర్భంగా పాటలలో చెప్పారు అన్నమయ్య. మన ఆధ్యాత్మిక విషయాలు, పరతత్వాలు, అంతరిక్ష శాస్త్ర విజ్ఞానాన్ని తెలియజేసేవేనని, అవి ఏవో మాయమాటలు కావని అన్నమయ్య కొన్ని సంకీర్తనలతో చక్కగా చెప్పారు.

“బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే “ అనే సంకీర్తన 385వది 2వ సంపుటంలో.

అంటే ,  బ్రహ్మము, పరబ్రహ్మము  ఒకే నైజము గల్గినవి. ఈ బ్రహ్మము అనే పదము చాలా సంకీర్తనలలో వాడియున్నారు అన్నమయ్య .,కానీ, బ్రహ్మ, పరబ్రహ్మ వేరు వేరు విభిన్న అస్తిత్వాలు.

పరబ్రహ్మ రూపం గూర్చి 3వ సంపుటంలో 244 వ సంకీర్తనలో చక్కగా చెప్పేసాడు అన్నమయ్య .

 పల్లవిలో” ఈ రూపమై  వున్నాడు ఈతడే పరబ్రహ్మము”  అనిచెప్పి,  చరణంలో పరబ్రహ్మని  వర్ణించాడు

చరణం:   గుడికొన్న  బ్రహ్మాన్డడాల  గుడ్లుపెట్టే  హంస
                సదరపు  బ్రహ్మలకు జలజ మూల కందము

హంస, జ్ఞానానికి, తేజస్సుకు, శుద్ధత్వానికి  ప్రతీక. కనుక, అనేక బ్రహ్మండాలను  సృష్టించే  హంసయే పరబ్రహ్మ.  “పరబ్రహ్మ ఒక స్థానము”, అక్కడి నుండి అనేక సంఖ్యలో బ్రహ్మలు సృష్టింపబడతారు.
అనేక శక్తి రూపాల సమ్పుటిఐ , అద్భుతమయిన తేజస్సుతో  విలసిల్లెడి పరబ్రహ్మయే   బ్రహ్మలకు మూలమైన  స్థానము . “ పరబ్రహ్మ “ లోని “ఓజస్సు , తేజస్సులే” , అంటే, పరబ్రహ్మత్వమే  అనేక బ్రహ్మల సృష్టికి కారణము.


పరబ్రహ్మ లోని గుణాలే బ్రాహ్మలలో ఉండకతప్పదు గదా? కానీ, బ్రహ్మలోని శక్తి , పరబ్రహ్మలోనున్నంత  ప్రమాణంలో వుండదు.  రెండింటిలోని తత్వమొక్కటే కానీ శక్తిత్వము వేరే..

           
                              అన్నమయ్య మాట



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి