12, జూన్ 2018, మంగళవారం

పరంజ్యోతి

 అన్నమయ్య , తాను   “ శ్రీహరి పంపిటు సేసితిమింతే, ఏ  ఎడ  శ్రీవేంకటేశునాజ్ఞలివి “..అని ఒక సంకీర్తనలో
చక్కగా చెప్పేసాడు. ( 4వ సంపుటం, 254వ సంకీర్తనంలో ). ఆయన శ్రీ హరి దూత. శ్రీవేంకటేసుని ఆజ్ఞగా, అనేక సంకీర్తనల రూపంలో, ఆధ్యాత్మిక, సాంఘిక, సాంస్కృతిక, ఉపదేసాత్మక, సందేశాత్మక, విజ్ఞానాత్మక , విమర్శనాత్మక విషయాలను ఈ ప్రపంచానికి అందించిన మహా దైవజ్ఞుడు శ్రీ అన్నమాచార్య. శ్రీహరిని  చూచి
శ్రీ హరి కటాక్షముతో  ఆ శ్రీహరి రూపాన్ని వర్ణించాడు, ఈ క్రింది సంకీర్తనలో. .......

           పరమాత్ముడవు నీవు పరంజ్యోతివి
            యిరవుగా కంటి  వింటి నీ రూపము..         ( సంపుటం4, సంకీర్తనము 356 ).

అంటే  దైవము రూపము వెలుగే.. అది సాధారణంగా మనము చూసే వెలుగు లాంటిది కాదు.
ఆ విశేషమైన వెలుగుని  తేజస్సు అంటారు. ఆ తేజస్సు ఎలాంటిది?  ఓజస్సు , అనేకమైన శక్తిరూపములు చేరిన అద్భుతమైన ప్రకాశమే పరంజ్యోతి. ఈ తేజస్సే విశ్వాఅంతరాళ మందు వ్యాపించియున్నది.
ఈ పరంజ్యోతియే   విశ్వంలోని  అన్ని  బ్రహ్మానందకోట్లను  మోయుచున్నదని, ఇదియె “విశ్వతోముఖ
అనంతమూర్తి “ అని క్రింది సంకీర్తనలో చెప్పాడు.

                     పెక్కురోమకూపముల  పెక్కుబ్రహ్మండాలు   మోచే
                      వెక్కసపు నీకు త్రివిక్రమాకృతి యేమి    

“రోమకూపములు “ అంటే కాంతి కిరణాలు వెదజల్లే బావులు. ఈ  రోమకూపములనుండి  వెదజల్లబడే  కాంతి తరంగాలలోనే  అనేక   బ్రహ్మామ్డాలు నిలబడియున్నవి. అనగా,  రోమకూపములలో నిబిడీకృతమైనది
ఆ “పరంజ్యోతి “ యే. విశ్వమంతా అనేక స్థానాలలో, ఈ రోమకూపములున్నవి. ఇవి బావులవలె లోతైన గుంతలవలె  ఉంటాయి. వీటినుండి వెడలే  కాంతి, ఆ పరంజ్యోతియే. కనుక ఈ విధంగా, కాస్మోస్ అంతా
రోమకూపములద్వారా “ పరంజ్యోతి “ ప్రకాసించి, వ్యాపించి, బ్రహ్మామ్డాలను ధారణ చేయు చున్నది.

ఈ విశ్వకాన్తియే సూర్య చంద్రులలో నున్న ప్రకాశము.  అని ఈ క్రింది సంకీర్తనలో అన్నమయ్య చెప్పాడు.

                    “ సూర్యునిలో  తేజము ,  సోమునిలో  తేజము
                          శౌర్యపుటనలు ,  విభాస్వత్తేజము
                              వీర్యపుటెజ్ఞ  భాగాల  విష్ణునామ తేజము “.  ( సంపుటం 2, సంకీర్తన 371. )

ఇది సామాన్యమైన  తేజస్సు కాదు. “ కనిపించని, అన్నిరకాల శక్తి రూపాల సంకలిత అద్భుత విశ్వ త్తేజము.”
దాని పేరు “విష్ణు “.  విష్ణు నామ తేజమే “ పరంజ్యోతి “. సర్వాంతర్యామిఅయిన  విరాత్తేజమే, పరంజ్యోతి యగు “విష్ణు తేజము “.

                                            అన్నమయ్య మాట

,

                           


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి