అన్నమయ్య చాలా సంకీర్తనలలో, విష్ణువును, “పరమాత్మ “అనే పిలుపుతో, సంభోదించారు . అంటే , విష్ణు తత్వముగల పరబ్రహ్మ తత్వమే, పరమాత్మలోనూ వున్నదని అర్ధము గదా!
ఇంకొన్ని పాటలలో, నారాయణుడే పరమాత్ముడని, నారాయణుడే హరియని, సంభోధించారు. కాబట్టి, ఏ పరంజ్యోతి, విష్ణువులో నున్నదో, అదే పరంజ్యోతి మరిఅంతరిక్షమంతా వ్యాపించున్న, ఆ పరమాత్మలోనూ వున్నదని అర్ధము. ఎక్కడెక్కడ? , ఏవిధముగా? వున్నది ? అనే ప్రశ్నకు, జవాబు, అన్నమయ్య పాడిన ఈ క్రింది సంకీర్తనలోనున్నది.
( సంకెర్తన 432, సంపుటం 2 ).......
“ అణు రేణు పరిపూర్ణమైన రూపం, ఆది అంత్యము లేని ఆరూపం.
“ కాలపు సూర్య చంద్రాగ్ని గల రూపం, మేలిమి వైకుంఠాన మెరిసిన రూపం “
“ ముంచిన బ్రహ్మాదులకు మూలమైన రూపం, మంచి పరబ్రహ్మమే మము ఏలిన రూపం . “
శ్రేష్ఠమైన విష్ణు లోకమగు, వైకుంఠంలో మెరియుచున్న “పరంజ్యోతి “యే, విష్ణువు. లోకములలోన ప్రతి అణువులో నున్నది అదే, సూర్య చంద్రులలో అగ్నిరూపంలోనున్నది అదే, “ కాల రుద్రుని”లోని, అగ్నియూ నదే .
బ్రహ్మలను పుట్టించు “ పరబ్రహ్మ “ లోనున్నదీ ఇదే.
ఏ వస్తువులోనైనా, ఏ జీవములోనైనా, ఒక రూపం తప్పక ఉంది. అది ఆ విష్ణు కాంతియే .
ఒక స్తంభంలో కూడా ఉంటుందని, ప్రహ్లాదుడు, ఎప్పుడో , నిరూపించాడు.
“ ముంచిన బ్రహ్మలు “ = లోకాలు గాని, గ్రహాలు గాని, నక్షత్రాలుగాని, మరి యే రకమైన ఆకాశ అస్తిత్వాలు గానీ బలహీనమై స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు, కుంచించుకొని, క్షీణించి, దగ్గరలోనున్న బ్రహ్మ యొక్క ఆకర్షణ క్షేత్రంలోకి పడి , బ్రహ్మలో ముంచబడుతాయి. ఈరకంగా, ఆకాశ అస్తిత్వాలను తనలోనికి ముంచివేసి, దాచుకొనే బ్రహ్మలను ,“ ముంచిన బ్రహ్మలు “ అని , అన్నమయ్య సెలవిచ్చ్చారు. అలాంటి బ్రహ్మలకు కూడా మూలమైన పరబ్రహ్మ తేజస్సే , సర్వాంతర్యామిఅయ్, ప్రతి అణు పరమాణువులోను, అదృశ్యంగా
ఉన్నది. అదే , “విష్ణు రూపం. “.
భూనభోంతరాళాలలో ప్రతి అణుపరమాణువులో, అదృశ్యమై , నిండి ఉన్న , ఒక పరిపూర్ణ రూపము ,
సర్వ శక్తిమయ తేజోరూపము ..... “విష్ణు రూపం ” ..
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి