19, జూన్ 2018, మంగళవారం

నల్లని కాంతి

   అన్నమయ్య ,”  పరబ్రహ్మము ” అంటే ,  లోకాలన్నీ వ్యాపించిఉన్న “విశ్వకాంతియే ” అని, అను పరమానులోనున్న పరంజ్యోతి యని, చాలా సంకీర్తనలలో చెప్పారు. ఆపరబ్రహ్మము , ఒక  “ సంజీవి “లాంటిది.
ఎంత మహిమాన్వితమైనదో , క్రింది సంకీర్తనలో చెప్పాడు.

                    “  సకల జీవులకెల్ల “సంజీవి “ ఈ మందు. “

ప్రజ్వల   తేజస్సుతో , సకల జీవరాశులలో ” ప్రాణ శక్తి “ ని ప్రసాదించే “పరబ్రహ్మమే ,యీ  “ సంజీవి”  లాంటి  “మందు”, హాఁ! హా ! యీ   “పరబ్రహ్మమే” సంజీవి  అని, అన్నమయ్య       చెప్తున్నాడు.

“ సంజీవి “ అంటే , “ప్రాణమిచ్ఛేది ” యని అర్ధము. అంటే , “ప్ర్రాణ శక్తి “ యగు  “ఓజస్సు. “
ఓజస్సు=  “ పుష్ఠి , తుష్ఠి కలిగించే ప్రాణశక్తి “. ఆ  “సంజీవి ” యగు  విష్ణువే,  చరాచరములకు,  సకల జీవాజీవములకు  ఆధారము.

“ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః “ అని “విష్ణుసహస్రనామం”లో,  “విష్ణు రూపము “  చక్కగా  వర్ణించబడివుంది. కనుక, విష్ణువు =  పరబ్రహ్మం =  పరమాత్మ =  పరంజ్యోతి

   “ సకల జీవులకెల్లఁ  “  సంజీవి “ యీ  మందు “


                 “మూడు లోకములొక్కటఁ ముంచి పెరిగినది
                    పోడిమి “ నల్లని కాంతి “ పొదలినది
                        వేడుక కొమ్ములు నాల్గు పెనచ్చి, చేయి  వారినది “.

అలాంటి  విష్ణువు, ఒకప్పుడు, కొన్ని కోట్ల కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం,  మూడు లోకాలను ఒక్కసారిగా నాశనముచేసి,  ఒకే ఒక్క చోటులో,  మూడు లోకాలను ముంచివేయడం  జరిగింది. ఈ సందర్భంలో, మూడులోకాలలోని పదార్ధము, శక్తి రూపంలోకి పరివర్తనమైంది. ఎంత పదార్ధమో,  వూహకు అందదు. ఎంత శక్తో , చెప్పడానికి అలవికాదు. ఈ ఘటన లో చెప్పడానికి వీలుపడనంత  “ఆకర్షణ శక్తి “ (గ్రావిటీ ) ఆ
“పరబ్రహ్మ “ స్థానంలో  సృజిస్తుంది.  అందుండి,  మళ్ళీ మళ్ళీ క్రొత్త క్రొత్త  పదార్థాలు సృజించబడతాయి..
అవి, మళ్ళీ   క్రొత్త మూడు లోకాలు గూడా కావచ్చు.

“ఈ ప్రళయ ఘటన , “ పదార్థము  శక్తి గ పరివర్తన“ ఘటన. “
“ మాస్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ “.  అని , సైన్స్  నిర్వచిస్తుంది.

ఆశక్తి రూపం కోట్ల సూర్యకోట్ల ప్రకాశముగా, ప్రకటమైంది.  ఎంత ప్రకాశమంటే,  అది చివరికి  కంటికానని ప్రకాశము అవడం వల్ల , మొత్తం  నల్లగ  కనిపించుతుంది.అన్నమయ్య, నల్లని పొదలాగా  కనిపించే విష్ణుకాంతిని, “నల్లనికాంతి “ అని వర్ణించాడు.  ఈ “ నల్లని కాంతి ” పొదలోనుండి , నాలుగు కొమ్ములు,  నాలుగు  చేతులలాగా , పెకలించుకోని , బయటకు వచ్చ్చాయట.  అందుకే, విష్ణు రూపకల్పనలో నాలుగు చేతులు, చూపుతారు.

                   పడిగెలు  వేయింటి పాము కాచుకొన్నది.
                   కడు  వేద శాస్త్రాల గబ్బు వేసేది
                 అలరిన బ్రహ్మ రుద్రాదుల పుట్టించినది
                వెలుగు తోడుత శ్రీ వెంకటాద్రి

ఆ “ నల్లని కాంతి “ లోనుండి , వేయిపడగలు పాము వంటి రూపం, ప్రకటమైంది.
 పాము అంటే , విషమయం.  ఆ “నల్లనికాంతి”  పొదలో  పుట్టినది, విష వాయువులు  కక్కే వేయిపడగల  పాము రూపం.  ఈ  “నల్లని కాంతి ” కుంభం నుండే,  బ్రహ్మలు, రుద్రులు  సృష్టింపబడ్డారు.
ఆనల్లకాన్తి   నుండే వేద  శాస్త్రాల  లోని   అప్పార  జ్ఞానపు సువాసనలు వెదజల్లబడుచున్నది.       
అంటే ,ఏ  స్థాన   మెందు  ?    ఎందులోన మూడులోకాలు ముగిసి , ముణిగి, ఇమిడి వున్నవో ,
 ఎందుండి బ్రహ్మరుద్రాదులు పుట్టారో ,  ఎందుండి నాలుగు చేతులవంటి కొమ్ములు పుట్టాయో,
ఎందుండి విషవాయు పూరిత వేయి పడిగల పాము రూపం లేచి కాయుచున్నదో , ఆ, ఆ స్థానమే, తేజోమయ  “పరబ్రహ్మ “.  అదే సకల జీవులకు  “ సంజీవి “.

               అన్నమయ్య మాట.




     






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి