21, జూన్ 2018, గురువారం

కాస్మిక్అంకెలు

      అన్నమయ్య తన  సంకీర్తనల్లో  , ఎంతో ఆధ్యాత్మిక, సాంఘిక, పౌరాణిక, సందేశాత్మక, వైజ్ఞానిక, ప్రభోదాత్మక, ఆచార వ్యవహారాత్మక, భజనాత్మక విషయాలు,  మనకు తెలియజేసారు.
కానీ,  సంఖ్యాత్మకంగా కూడా, కొన్ని  విషయాలు చెప్పియున్నారు. అవి ఈ సంకీర్తనలలో వున్నాయి.

ఒకటి ;        “  ఇతడొక్కడే సర్వేశ్వరుడు “ అంటే , అన్ని లోకాలను కాపాడేది ఒక్కడే.
                       “ విష్ణు డొక్కడే విశ్వాత్మకుడు“ .  విష్ణువు నెంబర్ ఒక్కటి.   (2వ సంపుటం, 314 సంకీర్తనం  )
                         “ ఉపమించి  చూసితె  ఒక్కటే జగము ..   ( సంపుటం2, సంకీర్తనం 314)
                           “ఒక్కటే  అంతర్యామి , ఉపకారి చేపట్టు “ (1వ సంపుటం , 500 సంకీర్తనం )
                     
రెండు :       “ రెండు మూలికలు , రేయి పగలు నున్నవి “.    ( 1వ సంపుటం, 452 సంకీర్తన )
                       రాత్రి, పగలు “ అనే వి 2 చాలా ముఖ్యమైన  సృష్టి విషయాలు.

మూడు :       ముల్లోకములు , అంటే,  స్వర్గలోకము, భూలోకము, పాతాళలోకము.

నాలుగు:        నాల్గు దిక్కులను

ఐదు :            ఇల “  పంచభూతములలో ” గుణములు .

ఆరు:           అరయ  ఆరుకోణముల నమరిన “చక్రమా” .  ( 3. 282సంకీర్తనం )

ఏడు            

ఎనిమిది:          “మించి  నిండుకొంటే  8 ఏ దిక్కులు “. ( 2, సంకీర్తనం 314 )

తొమ్మిది:             అల   “నవగ్రహవిహారంబు “ ( 2, సంకీర్తనం 345 ).


                         “  నట్టనడుమ వారే  నవబ్రహ్మలు “ ( 3, సంకీర్తనం 333)
పది:

పదకొండు:                   “తాలిమి  ఏకాదశరుద్రులు”           ( సంపుటం 3, 333 వ సంకీర్తనం ).

పన్నెండు:                “పండ్రెండు రాసులు “
                               “నీవొక్కడివే  సర్వాధారము,  నీయందే  ద్వాదశాదిత్యులు “ ( 3,  సంకీర్తన 239 )

 పదునాల్గు:           “యెనసి పదునాలుగే ఎడమైన లోకములు “     ( సంపుటం 2, 314 సంకీర్తన )

                           అంటే శాశ్వత లోకాలు  14మాత్రమే , మిగిలినవి అల్ప కాల లోకాలు.

పదహారు:              అట్టే  “పదారు భుజాల నమరిన చక్రమా “  ( 3, సంకీర్తన 282 )


                   “ ఎవ్వని నాభి పుట్టె  లోకములు , ఎవ్వని  కుక్షి  నీ జగములు వున్నవి “
                  “ అంకెల  శ్రీ వెంకటేశు నండనుండరో “.     ( 3, సంకీర్తనం 241 )

నూరు:          “ పది పది హరి నీ  పదమే నిజము “ (సంకీర్తనం 312, సంపుటం ).
                         అంటే,  ( 10 సార్లు 10 ) 100 వ అంచె లో విష్ణులోకము.

వెయ్యి:             “ ధారలు వేయి తోటి తగు చక్రమా “( 282 సంకీర్తనం,  3వ సంపుటం )
                            విష్ణు చక్రం, వెయ్యి ధారలతో , తేజోమయమైన అగ్ని శిఖలను, ఆకాశమంతా వెదజల్లుతూ
                              బ్రహ్మాన్డములను ప్రకాశవంతం చేయుచున్నది.

కోట్లు :               “ కుందని నీ రోమకూపములలో   గొందూల  బ్రహ్మాణ్డకొట్లట          

                         
“అంకెల వెంకటేశు “, అనే ఒక విశేష ప్రయోగం చేశారు అన్నమయ్య.  ఇందులో గూఢార్థముంది .
వెంకటేశు,  వైకుంఠ విష్ణు , సృష్టిల,  ప్రతి అస్తిత్వానికి ఒక “అంకె “  నియామకమై ఉంటుంది. .
ప్రతి  పదార్దానికి,  అది సామూహికమైనా, ఓక్కటే అయినా , ప్రతి కాస్మిక్ అస్తిత్వానికి ఒక నెంబర్      జోడించబడి ఉంటుంది. ఆలెక్కన, ప్రతి జీవికి ఒక నెంబర్ ఉండాలిగదా ?......

                అన్నమయ్య మాట.
       

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి