మన దేశంలో, “ మాయ “ అనే పదం చాలా సాధారణంగా వినిపిస్తూవుంటుంది. మనకు తెలియకుండానే , మనల్ని ప్రభావితం చేయడమనే భావంతో వాడబడుతోంది . కానీ అలాగెందుకు అవుతోంది ? ఈ మాయ ఎల్లాగ వుంటుంది ? మాయనుండి తప్పించుకోవడం ఎలాగ ?...? అన్నమయ్య మనకు చక్కగా, తక్కువ పదాలతో, తన సంకీర్తనల ద్వారా చెప్పార
“ తెలియరాదు నీ మాయ , “ తెర మరుగు “, పెక్కు “వలల “ చిక్కక నిన్నే కొలువగవలయ”
“చూడగ ఈ జగత్తుకు సూత్రధారివి నీవు, జోడైన ఈ సుత్రాన ఆడుచును సర్వంబున్నది. యే డచూచినా నీవుందు నెవ్వరికి కానరావు, “
తెర మరుగు “ అంటే ఒక తెరలోపల దాగివుందని అర్ధం. మాయ అనేది ఒక “ వల “ లాగా , ప్రపంచాన్ని , అందులోన. మనల్ని , కప్పి వుంది. ప్రపంచమంతా వ్యాపించియున్న ఆ “పరంజ్యోతిని “ కూడా కప్పివుంది. కనుకే, దైవము కానరాడు . “మాయ “ అనే తెర తొలిగితేనే , సర్వమూ కనిపిస్తుంది..
“పొలసి “ మసకమందు “ పోడమేటి జీవుని “. ( 4, సంకీర్తన 363).
బిడ్డ తల్లి గర్భమందు , యీ మాయ అనిపిలువబడే సంచీ లోనే ఉంటాడు. అది తొలగినాకే పుడతాడు..
పుట్టుక ముందూ , పుట్టిన పిదప కూడా , జీవి “మాయాజాలం “ లోన , చిక్కుకొని వుంటాడన్నమాట.
మాయ అంటే? మాయ లక్షణాలు?? మాయ అనే వలనుండి బయటపడడం??....
సత్వ, రజస్తమో గుణాల సమ్మేళనం మాయ. పంచ భూత వికారాలతో , నల్లని రంగుతో, ప్రకృతి నుండి పుట్టినది మాయ. పంచ భూతాలగు “భూమి, ఆకాశము, జలము, వాయువు, అగ్ని “ , ప్రతి ఒక్కటి, ఒక శక్తి ని కలిగివున్నవి. “ భూమ్యాకర్షణ శక్తి , కాస్మిక్ శక్తి, జలప్రవాహ శక్తి , వాయు శక్తి, ఉష్ణశక్తి “, అనే పంచభూతాత్మక శక్తులు మాయలో ఉంటాయి. ఏ శక్తీ ఎలాగ కనిపించదో, అలాగే “మాయా శక్తి “యూ కనిపించదు. మరి , మాయ త్రిగుణాల సంగమం గదా, అంటే, అన్ని గుణాలు ఎదో ఒక రకమైన “శక్తి తరంగరూపాలే. “ అని అర్ధం.
ఆంతేకాదు , మాయ మనస్సును ప్రభావితం చేయడం వల్ల, “కామ క్రోధ మోహ మదమాత్సర్యాలు “, ప్రేమ మమతా దయ కరుణ అనే, పంచ భూతవికారాలను ప్రకోపిస్తుంది.
మనోవికారాలు ఉత్పన్నమఔతాయి. ప్రతి . “మనో భావం” ఒక “ శక్తితరంగమే” ఖఛ్చితంగా, ఖఛ్చితంగా.
అదృశ్యంగా “ పరంజ్యోతి”ని కప్పిపెట్టివుంచే నల్లని తెర అయిన , ఈ “మాయ “ ప్రపంచ మంతా వ్యాపించి యున్నది. ఈ మాయామోహం నుండి బయటపడే మార్గం , క్రింది సంకీర్తనలో చెప్పారు
అన్నమయ్య.
“దండితోడ నీ మాయ దాటేయందుకు ఉపాయము , నిండు నిదానంగా నీపై భక్తి “
“ఇంతకంటే మరిలేదు , ఎవ్వరినీ ఉపాయము “. ( 2, సంకీర్తనం 334)
“మాయ “అనే తెర తొలగడానికి , పరంజ్యోతి దర్శనానికి మార్గం, “భక్తి “ ఒక్కటే, అని ఒక్కాణించి చెప్తారు అన్నమయ్య , “ భక్తి భావం “ గూడా , ఒక “శక్తి “ యే, “మాయా శక్తి” కంటే పవర్ఫుల్., బలీయమైనది.
భక్తి శక్తి ఒక్కటే, మాయాశక్తి పొరని తెరిచేసి , ఆ అద్భుతమైన, కోటిసూర్యకోటి తేజోమయమైన , సర్వవ్యాపియైన, విశ్వకాంతిని చూపించగలదు .
అన్నమయ్య మాట

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి