17, జూన్ 2018, ఆదివారం

విష్ణు చక్రం

అన్నమయ్య, “ విష్ణు చక్రం “ ఎలాగుంటుందో , దాని నిర్మాణం గూర్చి, ఎంతో చక్కగా ఒక సంకీర్తనలో వివరించారు.  అన్ని లోకాలకు ఆధారమైన , అన్నిలోకాలకంటే  ఉఛ్చస్థాయిలో  వున్న విష్ణులోకం లో, ఒక మహాద్భుతమైన చక్రం విరాజమానమై వుంది.  ఇదియే , మిగిన లోకాల స్థితి గతులకు జాగ్రత్తగా కాపాడే
శక్తిద్ధారణ చక్రి.  మహత్తర మైన, ఆ “విష్ణు చక్రం “, ఎల్లాగుంటుంది????ఈ, 3వసంపుటం,  282 సంకీర్తన లో 
విశదీకరించారు అన్నమయ్య. ....... 

                 “ నమో నమో దానవ వినాశ చక్రమా , సమర విజయమైన “ సర్వేశు చక్రమా ”

          “  అట్టే  పదారు భుజాల  నమారిన  చక్రమా 
               పట్టిన ఆయుధముల బలు చక్రమా 
                  నెట్టన  మూడుకన్నుల  నిలచిన  చక్రమా 
                    అట్టుగా  మన్నించవే  మెరయుచు  చక్రమా “

16 భుజాలు , ఆయుధాలుగా గలిగి,  మూడు కన్నులవంటి లోకాలలో  మెరుస్తూ, ప్రకాశవంతగా , తేజస్సును  
వెదజల్లుతూ ఉంటుంది. 

                          “ఆరయ  నారుకోనాల  నమరిన  చక్రమా 
                             ధారలు వేయితోటి  తగు చక్రమా 
                               ఆరక,  మీదికివెళ్ళే  అగ్ని శిఖల  చక్రమా 
                                 గారవాన, నీ  దాసుల  గావవే  చక్రమా “. 

 విష్ణు చక్రం, 6 కోణాలతో, 1000 జ్వాలల ప్రజ్వల  ధారలు వెదజిమ్మే, ఎప్పటికీ  ఆరకుండా,  ఆగకుండా  తిరిగే  మహత్తరమైన  చక్రము.  ఈ చక్రము వెదజల్లే వేయి ధారాలలో ఏమున్నది.???
విష్ణువు లోని, తేజస్సు, ఓజస్సు, ప్రకాశము,, అగ్ని ,సకల శక్తుల సమ్మేళనంగా నున్న అద్భుత తత్వంవున్నది. 
  
                     “  రవిచంద్రకోటి  రాశి అయిన  చక్రమా
                        దివిజ  సేవితమైన  దివ్యచక్రమా “

విష్ణుచక్రం, కోటి సూర్య చంద్రులలోనున్న  తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక ఊహకందని  “దివ్యచక్రం“.. 

16 భుజాలు , 6 కోణములు, 1000 ధారలు , కోట్ల సూర్య తేజస్సు కలిగి,  ఆగక,  ఆరక, తిరుగుతూ,  సమస్త నభోంతరాళాలలోని  అనంతకోటి  బ్రహ్మాండాలను  ధారణ చేసే, రక్షించే ,  అగ్నిశిఖల , అద్భుత చక్రమే    “ విష్ణు చక్రము. “
“విష్ణు చక్రము “ ఒక  “విజయచక్రము. “.   

             అన్నమయ్య మాట  
   


                         

      

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి