శ్రీ శ్రీ అన్నమాచార్యులవారు,ఎన్నో గొప్ప అంతరిక్ష రహస్యాలు , తన సంకీర్తనలద్వారా మనకు తెలియచేసిన మహా విజ్ఞాని, మహా జ్ఞాని. ఈ నాటి “ లొక్డౌన్" కరోనా పరిస్థితి యే , ఆ 15 వ శతాబ్దిలో కూడా వచ్చ్చిందని , ఒక సంకీర్తనలో వెల్లడించారు.
ఆకాశాన సూర్యచంద్రులు ఎదురెదురెయిన కాలము, అంటే “గ్రహణం “ సంభవించిన స్థితి , అది ఎటువం “
ఒకానొక సందర్భాన, ఒకానొక పరిపరిస్థితి ఎలాగొచ్చిందంటే , ఎవ్వరు వెలియ తిరుగకూడదు, ఇంటిలోనే ఉండవలసినది. అట్టి పరిస్థిలో ఎవ్వరూ ఇంకొకరిని కలవరాదు. తిరుపతి పూర్తిగా నిశ్శబ్దమై , నిశ్శబ్దంలో నిలిచిన సంధర్భమది . ఒక్కరూ ఇంటిలోనుండి బయట తిరగడమే , సాహసించడం లాంటి స్థితి. ఒకవేళ ఇంటినుండి బయటికి వచ్చ్చినాకూడా , ఒక్కరే , ఎలాంటి జోడు లేకుండా , దూరముగా తిరుగవలసిన నిర్బంధపూరిత వాతావరణ పరిస్థితి ఏర్పడినది.
“ ఓహోహో యనరో పారి , సాహసాన తిరుగరో జంట పారి ”.
ఆకాశాన సూర్యచంద్రులు ఎదురెదురెయిన కాలము, అంటే “గ్రహణం “ సంభవించిన స్థితి , అది ఎటువం “
గ్రహణమంటే, ఎవ్వరూ దర్శించకూడనిది. ఆ వాతావరణములో వెలుపల తిరగడమంటే , పెద్ద “ సాహసముగా” భావించబడ్డ విషమకాలము, విషకాలము. విష పూరిత వాతావరణము .
“ తిరుపణి మణగెను , తిరుగరాదెవ్వరికీ, మరల నెలుగియ్యరో మగపారి
“””””. ఇరవాయ సూర్యచంద్రులెదురు పారి “
“పేనిపట్టి వాకిళ్ళ బీగముద్రలాయనిడి, కానిమ్మని వాయించరో గంట పారి”
ఎంత నిశ్శబ్దనిర్బంధమంటే , దేవాలయం తలుపులు కూడా తాళ్లతోకట్టి బీగాలువేసి సీలు వేసారట. దేవాలయము బయటనుండి భక్తులు వారి, వారి కోరికలు విన్న వించుకోవలసినదే . ఒక నిశ్శబ్ద నిర్బంధ పరిస్థితి, శ్రీఅన్నమాచార్యులవారి కాలంలోకూడా వచ్చింది, అని పై సంకీర్తన చెప్తోంది .. కాలం వేరే , కానీ, కష్టమదే . పరిష్కారాలు : నిశ్శబ్దం, నిర్బంధం.
“ హిస్టరీ రిపీట్స్ “, అంటే చరిత్రలో జరిగినవి మళ్ళీ మళ్ళీ జరుగుతూంటాయి , అని భావం.
అన్నమయ్యనాటి నిశ్శబ్దంలాటిదే , నేటి కరోనా వైరస్ నిర్బంధం ......
అన్నమయ్య మాట